అత్యంత విశిష్టత గలిగి ప్రశిద్ద పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుంటిగంగ సన్నిధిలో ఆదివారం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులుతీర్చుకున్నారు. గంగమ్మతల్లి పొంగళ్లు పెట్టి చల్లగా చూడమని వేడుకున్నారు. తాళ్లూరు ప్రాంతంతో పాటు వివిధ ప్రాంతాల నుండి మొక్కులు తీర్చుకునేందుకు రావటంతో భక్తులతో సందడిగావుంది. గంగమ్మ తల్లిని అధికసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు వాహనదారులు వాహన పూజలు చేయించగా, మరికొందరు. భక్తులు గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు జరిపారు. పలువురు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకపూజారి ఎన్ . కామేశ్వరశర్మ భక్తులకు గోత్రనామ పూజలు నిర్వహించారు.
పూజారులు ప్రకాశ్ పంతులు, విజయలక్ష్మి, బాలరా జులు పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఈవో జి.వాసుబాబు, దేవస్థాన కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, ఆర్.ఏ ప్రసాద్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
