తూర్పుగంగవరంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాం వద్ద శ్రీసిద్ది బుద్ది సమేత శ్రీ వరశిద్ది వినాయక స్వామిశాంతికళ్యా ణం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ కమిటిఆధ్వర్యం లో పలువురు దంపతులు వినాయక స్వామికి శాంతి కళ్యాణం నిర్వహించారు. అర్చుకులు శాస్త్రోహక పూజలు, కళ్యాణ క్రతువు జరిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వినాయక ఉత్సవాల్లో భాగంగా శ్రీసిద్ధి బుద్ధిసమేత శ్రీవరశిద్ది వినాయక స్వామి శాంతికళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. అనంతరం భక్తులకు భారీ అన్న దానం, ప్రసాద పంపిణీ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలోఉత్సవ కమిటీ సభ్యులు వైయస్సార్ కే ప్రసాద్, సుందరలక్ష్మి దంపతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

