15% వృద్ధిరేటే లక్ష్యంతో వ్యవసాయం మరియు అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలి – జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

వ్యవసాయాన్ని రైతుకు లాభసాటిగా చేయడమే లక్ష్యంగా వ్యవసాయ సంబంధిత అధికారులు పనిచేయడంతో పాటు జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా ఈ సంవత్సరం 15% వృద్ధిరేటే లక్ష్యంతో వ్యవసాయం మరియు అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు , వ్యవసాయ మరియు అనుబంధ శాఖలైన హార్టికల్చర్, పశుసంవర్ధక, మైక్రో ఇరిగేషన్, సహకార, ప్రకృతి వ్యవసాయం, మత్స్య శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం సాధించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అందుకనుగుణంగా లక్ష్య సాధనకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో వ్యవసాయానికి అనుకూలంగా ఉండి నిరుపయోగంగా ఉన్న భూమిని సాగులోకి తీసుకువచ్చేందుకు వ్యవసాయ దాని అనుబంధాల శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి దానికనుగుణంగా సమగ్ర ప్రణాలికను రూపొందించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంచేలా తదనుగుణంగా అధిక ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తూ యాంత్రీకరణలో భాగంగా రైతుల అవసరాలకు అనువైన యంత్రాలను గుర్తించాలన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఆ మండలాల్లో రైతుల అవసరాలను గుర్తించి వ్యవసాయ మరియు దాని అనుబంధ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను అమలు చేస్తూ మంచి ఫలితాలు సాధించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, గ్రామస్థాయిలో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా మరింత కృషి చేయాలన్నారు.
జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్దికి మంచి అవకాశం ఉందని, ప్రోటెన్షియల్ ఏరియాను గుర్తించి ఉద్యాన పంటల అభివృద్ధి పై రైతులను ప్రోత్సహించేలా కార్యాచరణ ప్రణాలికలను తయారుచేయాలన్నారు. జిల్లా లో సుక్ష్మ సేద్యం విధానాన్ని మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 6 వేల హెక్టార్లలో సుక్ష్మ సేద్యం విధానాన్ని అమలు చేస్తుండగా, మరో 1.01 లక్ష హెక్టార్లలో సుక్ష్మ సేద్యం విధానాన్ని అమలు చేయుటకు అవకాశం ఉందని అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించగా, రానున్న 2,3 సంవత్సరాల్లో లక్ష హెక్టార్లలో సుక్ష్మ సేద్యం విధానాన్ని అమలు చేయుటకు తీసుకోవాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్ ను తయారుచేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్రలో భాగంగా జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా ప్రణాలికలు రూపొందించి అందుకనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్, పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పశుగ్రాసం పంపిణీ, పశు భీమా లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. మత్స్య శాఖ ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, నిర్దేశించిన విధంగా వృద్ది రేటు సాధించేలా మత్స్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్ ను తయారుచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖలు ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాలపై పవర్ పాయింటం ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, పశుసంవర్ధక శాఖ జెడి రవి కుమార్, మత్స్య శాఖ జెడి శ్రీనివాస రావు, ప్రకృతి వ్యవసాయ అధికారి సుభాషిని, మార్క్ఫెడ్ అధికారి శ్రీహరి, ఎపిఎంఐపి పిడి శ్రీనివాస రావు, జిల్లా సెరికల్చర్ అధికారి సుజయ్, జిల్లా ఉద్యాన శాఖాధికారి గోపి చంద్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *