జిల్లాకు సంబంధించి ఈవిఎంలను భధ్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భధ్రత ఉండాలి – జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు

జిల్లాకు సంబంధించి ఈవిఎంలను భధ్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భధ్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు
సంబంధిత అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎన్నికల కమీషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గురువారం ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో గల ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్లు (ఇవిఎం) గోదాముల‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకాశం జిల్లా కు సంబందించిన ఒంగోలు, ఎస్ఎన్ పాడు, కొండేపి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి , మొత్తం 8 నియోజకవర్గాలకు సంబందించిన ఈవీఎంలు వివి ప్యాడ్స్, కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్ లను అక్కడి భధ్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్షుణంగా పరిశీలన చేశారు. అప్ర‌మ‌త్తుంగా ఉండాల‌ని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఒంగోలు డిఆర్ఓ చిన ఓబులేసు క‌లెక్టరేట్ సూప‌రింటిండెంట్ శ్రీనివాస రావు, ఒంగోలు తహసీల్దారు మధుసూదన్ రావు, వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్, టీడీపీ నుండి కోనేటి వెంకటరావు , బీజేపీ తరపున గుర్రం సత్యం, కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్.కె రసూల్, మరియు రాజశేఖర్ రెడ్డి, ఉపేంద్ర, నవీన్, ఇత‌ర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *