నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చటమే ఉల్లాస్ ముఖ్య ఉద్దేశమని ఎంపీడీవో అజిత అన్నారు.
తాళ్లూరు వెలుగు కార్యాలయంలో సోమవారం ఉల్లాస్ టు కార్యక్రమాన్ని అక్షర భారతి సూపర్వైజర్ చౌడి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
తాళ్లూరు ఎంపీడీవో అజిత, మన్నేపల్లి సొసైటీ చైర్మన్ గొంది రమణారెడ్డి ( సమర ), వీటి సంఘ ఉపాధ్యక్షుడు తూము శివనాగిరెడ్డి, ఇడ మకంటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఉల్లాస్ -2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో పొదుపు సంఘాల్లో ఉన్న 3095 మందిని అక్షరాలుగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. గ్రామాల్లో15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ, చదువుకోలేని లేదా మధ్యలో చదువు మానేసిన వ్యక్తులను గుర్తించి, వారికి చదవడం, రాయడం, లెక్కలు అర్థం చేసుకోవడం వంటి తెలివైన ప్రాథమిక విద్య అందించాలని తెలిపారు.జీవన నైపుణ్యాలపై దృష్టి ప్రాథమిక విద్యతో పాటు క్రిటికల్ లైఫ్ స్కిల్స్ (ఆర్థిక, డిజిటల్ జ్ఞానం, ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమం) మరియు వృత్తి నైపుణ్యాల అభివృద్ధి కూడా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికిస్వచ్ఛంద వాలంటీర్ల వాడకం మరియు సమాజ భాగస్వామ్యం వాలంటీరులను అనగా విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, ఆంగన్వాడీ కార్యకర్తలు, ఇతర స్థానిక సంస్థలు భాగస్వామ్యం చేసుకొని, సముదాయంలోనే విద్యా కార్యకలాపాలు జరగేందుకు ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం ఉల్లాస్ మెటీరియల్ ను పంపిణీ చేశారు, శ్రీ శక్తి డిపిఎం పవన్ కళ్యాణ్ మండల విద్యాశాఖ అధికారి జి సుబ్బయ్య ఏపి.ఎం దేవరాజ్ ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు .

