స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ప్రకటించిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర  కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాకు లభించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను జిల్లా కలెక్టర్  పి రాజాబాబు గురువారం ప్రకటించారు.
ఒంగోలు జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నందు   ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో  ప్రకాశం జిల్లాకు వచ్చిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల వివరాలను జిల్లా కలెక్టర్  రాజాబాబు, వెల్లడించారు. జిల్లాకు 3 రాష్ట్ర స్థాయి అవార్డులు, 49 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని తెలిపారు. స్వచ్ఛ నగర, మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు మొదలైన 17  విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రోత్సాహక అవార్డులు – 2025కు, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమాల కింద స్వచ్ఛతా కార్యకలాపాలపై చేసిన ప్రశంశనీయ కృషిని గుర్తించడానికి ప్రభుత్వం అవార్డులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR (తగ్గించటం, మళ్లీ ఉపయోగించడం, రీసైకిల్), సుస్థిర పద్ధతులలో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో అవార్డు గ్రహీతలు పని చేయడం జరిగిందన్నారు. అవార్డులను మొత్తం 17 కేటగిరీలలో ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను గుర్తించడానికి, అన్ని రంగాలలో ఉన్న వారి భాగస్వామ్యం పెంచుటకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. స్వయం మూల్యాంకనం, జిల్లా అధికారుల పరిశీలన, తృతీయ పక్ష మూల్యాంకనంగా మూడు దశల్లో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు – 2025 రేటింగ్/ర్యాంకింగ్  జరిగిందన్నారు.  2025 అక్టోబర్ 6న విజయవాడలో రాష్ట్ర స్థాయి అవార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్రా (SASA) ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో ఈ అవార్డులు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని  కలెక్టర్  పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*ప్రకాశం జిల్లాకు వచ్చిన రాష్ట్రస్థాయి అవార్డులు వివరాలు*

* స్వచ్ఛ గ్రామ పంచాయతీలలో చీమకుర్తి మండలంలోని ఆర్.ఎల్. పురం కు,

* ఉత్తమ స్వచ్ఛ స్లామ్ లెవెల్ ఫెడరేషన్ లలో కనిగిరి మండలంలోని వీర బ్రహ్మేంద్ర మహిళా సమాఖ్య కు,

* స్వచ్ఛ హాస్పిటల్స్  విభాగంలో సి.హెచ్.సి, చీమకుర్తి కి రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం జరిగింది.

*జిల్లాస్థాయి వచ్చిన  అవార్డులు వివరాలు*

*స్వచ్ఛ మున్సిపాలిటీ విభాగంలో కనిగిరి  మున్సిపాలిటీ,

ఉత్తమ స్వచ్ఛ గ్రామ పంచాయతీలు:

* కంభంపాడు ( చంద్రశేఖర పురం మండలం)

* బింగినపల్లి ( సింగరాయకొండ మండలం)

* కనుమల్ల (సింగరాయకొండ మండలం)

* వడంపల్లి  (ఎర్రగొండపాలెం మండలం) 

ఉత్తమ స్వచ్ఛ గ్రామ సంఘాలు:

* గాలిజెరుగుల్ల ( బెస్తవారిపేట మండలం )

* అల్లూరు  (కొత్తపట్నం మండలం)

* పెదయాచవరం  (మార్కాపురం మండలం )

* సర్వేరెడ్డి పాలెం  ( ఒంగోలు మండలం )

* మూగచింతల  ( పొదిలి మండలం)

ఉత్తమ రైతు బజారు :

* ఒంగోలు కెపి బస్ స్టాండ్ రైతు బజారు.

ఉత్తమ స్వచ్ఛ స్లామ్ లెవెల్ ఫెడరేషన్:

* విశ్వ భారతి స్లమ్ సమాఖ్య, ఒంగోలు,

* అక్షిత మహిళా సమాఖ్య, కనిగిరి,

ఉత్తమ బస్ స్టేషన్:

*  ఒంగోలు బస్ స్టేషన్,

ఉత్తమ స్వచ్ఛ ఎన్జీవో:

* సోషల్ ఆక్టివిటీస్ ఫర్ రూరల్ డెవెలప్మెంట్ సొసైటీ, టంగుటూరు,

* ఐటిసి మిషన్ సునెహరా,  ఒంగోలు  అర్బన్,

ఉత్తమ స్వచ్ఛ ఆసుపత్రులు:

* ఒంగోలు మండల పరిధిలోని వెంగముక్కలపాలెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్,

* మద్దిపాడులోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,

* ఎర్రగొండపాలెంలోని ఏరియా హాస్పిటల్,

స్వచ్ఛ పాఠశాలలు:

* కనిగిరిలోని ఎపి మోడల్  స్కూల్, 

* కొమరోలులోని ప్రభుత్వ హై  స్కూల్,

* మార్కాపురం లోని కెజిబివి స్కూల్, 

* మార్కాపురం లోని మునిసిపల్ ఎస్సిబిసి హై స్కూల్,

* దర్శి మండలం చందలూర్ లోని   జడ్పి హై స్కూల్,

స్వచ్ఛత అంగన్వాడీలు:

* మద్దిపాడు మండలంలోని అన్నంగి  అంగన్వాడి కేంద్రం,

* మద్దిపాడు మండలంలోని లింగంగుంట  అంగన్వాడి కేంద్రం,

* మార్కాపురంలోని 13వ వార్డు  అంగన్వాడి కేంద్రం,

* కనిగిరి లోని 2వ వార్డు అంగన్వాడి కేంద్రం,

* కొనకనమిట్ల మండలంలోని తువ్వపాడు అంగన్వాడి కేంద్రం,

ఉత్తమ స్వచ్ఛత ప్రభుత్వ కార్యాలయాలు:

* ఒంగోలు లోని డ్వామా కార్యాలయం, 

* పొదిలిలోని తహసిల్దార్  కార్యాలయం,

* చీమకుర్తి లోని ఎంపిడిఓ కార్యాలయం,

ఉత్తమ స్వచ్ఛత పరిశ్రమలు (భారీ/ మధ్య తరహా) :

* భగీరధ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్  లిమిటెడ్

ఉత్తమ స్వచ్ఛత పరిశ్రమలు (ఎం.ఎస్.ఎం.ఇ):

* దేవి సీ ఫుడ్స్  లిమిటెడ్

* జేసి బయోటెక్  ప్రైవేట్ లిమిటెడ్,

ఉత్తమ స్వచ్ఛ హాస్టల్:

* సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహం,  ఒంగోలు, 

* సింగరాయకొండలోని ప్రభుత్వ బిసి బాలికల వసతి గృహం, 

* పుల్లలచెరువు మండలం, మురికిమల్లలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రం హై  స్కూల్ 

ఉత్తమ స్వచ్ఛ రెసిడెన్షియల్ పాఠశాల :

* సింగరాయకొండలోని ప్రభుత్వ బిసి బాలికల వసతి గృహం,

ఉత్తమ స్వచ్ఛత వారియర్స్ (పారిశుద్ధ్య కార్మికులు):

* ఒంగోలు  నగరపాలక సంస్థకు చెందిన ఎం. వెంకట్ 

* మార్కాపురం  మున్సిపాలిటీకి చెందిన టి. హరిబాబు

* గిద్దలూరు  మున్సిపాలిటీకి చెందిన కె బాలయ్య

* చీమకుర్తి  మున్సిపాలిటీకి చెందిన  కె. సుబ్బరత్నం

* పొదిలి  మున్సిపాలిటీకి చెందిన  జి. నాగేశ్వరరావు

ఉత్తమ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్స్

* చినఅలవలపాడు  గ్రామపంచాయతీకి చెందిన మల్లెల పౌలు, 

* బెస్తవారిపేట గ్రామపంచాయతీ చెందిన మట్టేమల్ల నాగరాజు,

* ఆర్ఎల్ పురం  గ్రామపంచాయతీకి చెందిన కడియం రామంజమ్మ, 

* వెస్ట్ నాయుడుపాలెం  గ్రామపంచాయతీకి చెందిన పల్లె ఏసోబు 

* కెపల్లె పాలెం  గ్రామపంచాయతీకి చెందిన  ఎం తిరుపతి

ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, ఒంగోలు  నగర పాలక కమిషనర్  వెంకటేశ్వర రావు,  జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *