తాళ్లూరు పోలీస్ స్టేషన్ ను దర్శి సీఐ రామా రావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల మద్యం సేవించటం తీవ్రంగా పరిగణిస్తూ కౌల్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు ముమ్మరంగా పడుతూ నీరు అధిక సంఖ్యలో ఉన్నందున నీటి వనరుల వద్ద యువకులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీపావళి మందు సామగ్రి అనుమతులు లేకుండా అమ్మకూడదని సరియైన అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే నిర్వాహకులు దీపావళి మందు గుండు సామగ్రిని అమ్మాలని తెలిపారు. పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతి ఒక్క అకౌంట్ పై ప్రత్యేక నిఘా ఉందని, వ్యక్తిగత హణనం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
ఎస్సై మల్లిఖార్జున రావు, ఎస్సై భాస్కర రావు సిబ్బంది పాల్గొన్నారు .
