పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థంచేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రధానమని.. ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలుకావాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు ఇరవై సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు.
ప్రకాశం జిల్లా కలెక్టరేట్ నందు ఇరవై సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి వైద్య ఆరోగ్యం మరియు విద్యాకు సంబందించిన పథకాలు , విబి జి రాం జి, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్లకు సంబంధించిన ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉపాధి హామీ – విబి జిరాం జి :
“ ఈ సంవత్సరం 1 జులై 2026 నుండి అమలు అవుతున్న వికాసిత్ భారత్ రోజ్‌గార్ మరియు ఆజీవిక హామీ మిషన్ (గ్రామీణ) (వీబి –జీ రామ్ జీ ) “ ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు బాటలుగా వినియోగించాలి.
లేబర్ వేతనాల వినియోగం మాత్రం పూర్తిగా 100% సాధించినట్లు లెక్కలు చూపారు, ఇప్పడు కె వై సీ అప్లై చేస్తే ఎంత మంది తగ్గారు, ఆ డబ్బు ఎవరి జేబులలోకి వెళ్లింది? ఈ అరాచకాలు అరికట్టి నిజమైన వేతనదారులకు న్యాయం చేయడం, పని దినాలు 100 నుండి 125 కు పెంచడం, రైతులకు సకాలంలో కూలీలు అందుబాటులో ఉండడానికి 60 రోజులు మినహాయింపు ఇచ్చిన అన్సంతరం 125 రోజుల పని దినాలు అంటే మొత్తం 185 రోజులు కూలి దొరికే విధంగా కేంద్ర ప్రభుత్వం “ వీబి –జీ రామ్ జీ “ తేవడం జరిగింది. ఈ పథకం క్రింద అత్యధిక నిధులు ప్రకాశం జిల్లాకు తేవడానికి ప్రణాళికలు రచించాలి. జలసిరి – బుగర్భ జలాల పెరుగుదల , మ్యాజిక్ డ్రైన్స్, గ్రామాల డిజిటలైజేషన్, పీఎం గతిశక్తి యోజన పనులు, హార్టికల్చర్ మౌలిక సదుపాయాలు తదితర అంశాల పైన ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించాడం జరిగింది.
వైద్యం మరియు ఆరోగ్యం :
పీఎం మాతృవందన యోజన, జననీ సురక్షా యోజన (జేఎస్వై), జననీ శిశు సంరక్ష కార్యక్రమం, రాష్ట్రీయ కిషోర్ స్వస్త కార్యక్రమం (ఆర్కెఎస్కె), రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ( ఆర్బీఎస్కె), ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఎన్టీఆర్ వైద్య సేవ, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ భోజన పథకం, పీఎం శ్రీ తదితర పథకాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించి, పురోగతికి అవసరమైన కార్యాచరణపై సూచనలు చేశారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు వేగవంతం కోసం అధికారులు మరింత చొరవ చూపాలన్నారు.
సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ …
వైద్య రంగం:
జిల్లాలో 19 నుండి 45 సంవత్సరాల వయస్సు వారికి మరియు ముఖ్యంగా 5 నుండి 19 సంవత్సరాల వారికి మరియు గర్భిణీ స్త్రీలకూ అవసరమైన వైద్యం అందించి మందులు అందిస్తూ ” అనీమియా ముక్త్ భారత్ “ కోసం అధికారులు కృషి చేస్తున్నారు.
ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ క్రింద జిల్లాలో ప్రతి 15 రోజులకు ఒకసారి ముందస్తు కాన్పులను తగ్గించడానికి స్కాన్లు మరియు రక్త పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెల 9 మరియు 10 వ తేదీ అన్ని ప్రభుత్వం ఆస్పత్రులలో గైనకాలజిస్ట్ ద్వారా గర్బీణీ స్త్రీలకు అన్ని పరీక్షలు మరియు సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2025 – 26 సంవత్సరంలో మొత్తం 25,735 మందిలో 6,205 హై రిస్క్ ప్రెగ్నెన్సీ ( 2026 – 27 కు ఇప్పటివరకు ల 4,662 మందిలో 1,117 హై రిస్క్ ప్రెగ్నెన్సీ ) కి ఈ సేవలను అందించడం జరిగింది
జిల్లాలో 2025 – 26 లో 100 శాతం 22,668 మంది ప్రసవాలు ఆసుపత్రుల ( ప్రభుత్వ మరియు ప్రైవేట్ జరుగుతున్నాయని.. ( 2026 – 27 కి , ఇప్పటి వరకు 1890 మంది ) ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన శిశువులకు సంబంధించిన గర్బిణి స్త్రీలకు పోషక ఆహారం కోసం జననీ సురక్షా యోజన ( JSY ) ద్వారా 700 రూపాయిలు మరియు సుఖీభవ ద్వారా 300 రూపాయిలు కలిపి మొత్తం 1000 రూపాయిలు చెప్పున 2025 – 26 కు 2,353 ( 2026 – 27 కు ఇప్పటి వరకు 783) మంది లబ్దిదారులకు అందించడం జరిగింది. అదేవిధంగా జననీ శిశు సంరక్ష కార్యక్రమం ( JSSK ) ద్వారా ఉచిత పౌష్టికాహారం, మందులు, వైద్య పరీక్షలు వంటి సేవలు కోసం ఈ సంవత్సరం 2025 – 26 సంవత్సరంలో మంది 2,353 శిశువులకు 9.38 లక్షల రూపాయిలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు.
కాయకల్ప క్రింద పబ్లిక్ హెల్త్ సెంటర్లను శుభ్రత, ఇన్ఫెక్షన్ సోకకుండా ఆహ్లాదకరంగా ఉంచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. 389 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో 67, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో14 , 15 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో , హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు లలో 4 , 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లులో 1 నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లు సర్టిఫికేషన్ పొందాయి.
స్వర్ణాంధ్ర విజన్ @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోందని.. ఈ క్రమంలో మాతా శిశు మరణాల రేటును మరింత తగ్గించడానికి జిల్లా అధికారులకు సూచనలు చేసినట్లు వెల్లడించారు.
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన క్రింద మొదటి కాన్పు సమయంలో 5 వేల రూపాయిలు రెండు వాయిదాలలో మరియు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో కాన్పు అయితే మరో వెయ్య రూపాయిలు కలిపి మొత్తం 6 వేలు, రెండవ కాన్పులో ఆడ శిశువుకు జన్మనిస్తే 6 వేలు ప్రోత్సాహకంగా నగదు అందించడం జరుగుతుంది. 2025 – 26 సంవత్సరంలో 4,269 మొదటి కాన్పు మరియు 1,108 రెండవ కాన్పు ఆడ శిశువు కలిపి మొత్తం 5,377 లబ్దిదారులకు నగదు బదిలీ చేయడం జరిగింది, 2025 – 26 సంవత్సరం నుండి ఈ కార్యక్రమ అమలు భాద్యతను ఐ సి డీ ఎస్ వారికి బదిలీ చేయడం జరిగింది.
స్కూల్ ఐ స్క్రీనింగ్ కార్యక్రమం క్రింద జిల్లాలో పాఠశాలలో 1.21 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి , 4.8 వేల మందికి కళ్ళ జోడులు అవసరం అయిన వారికి అందించడం జరిగింది. సీజనల్ వ్యాధులకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు : ముందస్తు రోగ నిరోధ లక్ష్యంగా ప్రాధమిక ఆరోగ్ర్యం కోసం జిల్లాలో 389 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, కొత్తగా 226 భవనాలు పూర్తి అయ్యాయి. మిగిలిన 163 ఆరోగ్య మందిరాలను అద్దె భవనాలలో ఉన్నాయిp.
రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ( ఆర్బీఎస్కె) :
జననం నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ బస్తీలు, అలాగే ప్రభుత్వ/సహాయ పాఠశాలల్లో చదివే పిల్లల ఆరోగ్య సమస్యలు గుర్తించి అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది.
స్క్రీనింగ్ విధానం:
1.74 లక్షల మంది పిల్లకు గాను ఇప్పటి వరకు 1.18 లక్షల మందికి స్క్రీనింగ్ పూర్తి చేయడం, మిగిలిన 56 వేల మందికి స్క్రీనింగ్ జరుగుతుంది. పుట్టిన శిశువులు: ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాల్లో మరియు ఇంటి వద్ద స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది.
6 సంవత్సరాల లోపు పిల్లలు: స్క్రీనింగ్‌ను నియమితంగా అంగన్వాడి కేంద్రాల్లో చేస్తారు.
6 నుండి 18 సంవత్సరాల పిల్లలు: మొబైల్ బ్లాక్ హెల్త్ టీమ్‌లు పాఠశాలల్లోనే స్క్రీనింగ్ నిర్వహిస్తాయి.
రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం (ఆర్కెఎస్కె) : 10 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పురుషులు మరియు మహిళలను నగర, గ్రామ ప్రాంతాల్లో, అలాగే పాఠశాలలో చదువుతున్నవారైనా, చదువును మానేసినవారైనా సమగ్రంగా కవర్ చేస్తుంది.
ఈ కార్యక్రమం నిరోధాత్మక, ప్రోత్సాహక మరియు చికిత్సాత్మక సేవలను అందించడంతో పాటు, కౌన్సెలింగ్ మరియు ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహించడం జరుగుతుంది..
జిల్లా లోని నాన్ కమ్యునబుల్ డిసీజ్ కేంద్రాలలో ఏప్రిల్ మరియు మే 2026 రెండు నెలలో 13,598 మందికి సేవలు అందించడం జరిగింది.
ప్రస్తుతం 991 మంది ఆశావర్కర్లు జిల్లాలో ఉన్నారు, వీరికి నెలకు 10 వేలు చొప్పున 2025 -26 కు కోట్లు చెల్లించడం జరిగింది. కందుకూరు లో 100 పడకల ఏరియా ఆసుపత్రి పూర్తి అయ్యింది మరియు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణంలో వుంది.
ప్రత్యేక పరిస్థితులలో జన్మించిన పిల్లల కోసం 10 పడకల కేర్ యూనిట్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒంగోలు రిమ్స్ లో నిరవహించడం జరుగుతుంది. 2025 – 26 సంవత్సరానికి 15 లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తే, 13.61% నిధులు 2.04 లక్షలు ఖర్చు చేయగా మిగతా నిధులు రిఫండ్ చేయడం జరిగింది.
పోషక విలువలు అతి తక్కువతో జన్మించిన పిల్లల కోసం నిర్వహిస్తున్న కేంద్రంలో మే 2026 లెక్కల ప్రకారం 42 అడ్మిషన్లు ( 25 మంది బాలురు, 17 మంది బాలికలు ) అయితే, మొత్తం 11.05 లక్షల రూపాయల నిధులలో 34.87% నిధులు 3.85 లక్షల రూపాయలు ఖర్చు చేసి మిగిలిన 7.20 లక్షలు రిఫండ్ చేయడం జరిగింది. మద్యం మరియు డ్రగ్స్ డీ అడిక్షన్ కోసం 30.71 లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తే, కేవలం 43.53% నిధులు 13.37 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది.
డయాలసిస్:
జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలలో కలిపి ప్రస్తుతం దాదాపు సెషన్స్ డయాలిసిస్ జరిగాయి. మరో రెండు పడకల డయాలిసిస్ కేంద్రాలు మరియు అవసరమని అధికారులు తెలిపారు.
ఐఎంఆర్ ( ప్రతి వెయ్య మంది శిశువుల జననంలో మరణాల రేట్ ) :
ప్రస్తుతం రాష్ట్ర సగటు 18 కాగా, జిల్లా సగటు 4.49 గా నమోదు అయ్యింది.
ఎంఎంఆర్ ( ప్రతి లక్ష మంది గర్భిణుల మరణాల రేట్ ) :
ప్రస్తుతం రాష్ట్ర సగటు 39 కాగా, జిల్లా సగటు 26.41 గా నమోదు అయ్యింది.
ఆరోగ్య రక్షణ కోసం సమన్వయ శాఖల సమష్టి కృషి
చిన్నారులు, గర్బిణీల్లో రక్తహీనత సమస్యలు లేకుండా చూడటంలో మరియు పోషక ఆహారం అందించడానికి ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలు, వైద్య ఆరోగ్యం మరియు విద్యాశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నాన్నారు.
ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన – డా. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా జిల్లాలో 2024 లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 97 ఆసుపత్రులలో 3,257 రకాల జబ్బులకు చికిత్స కోసం 2024 అనంతరం డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో ఏర్పడిన అనంతరం గత 24 నెలలో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా 1.26 లక్షల మందికి పైగా 292 కోట్ల రూపాయలకు పైగా విలువైన వైద్య సహాయాన్ని అందించడం జరిగింది.
జిల్లాలో మొత్తం అర్హులైన 8.31 లక్షలలో లక్షల మందికి పీఎంజేఏవై కార్డులు పంపిణీ కోసం సర్వే పూర్తి 8.08 చేశామని అధికారులు తెలిపారు, మిగిలిన వారుంటే వారికి కూడా సత్వరం పంపిణీ చేయాలని అధికారులను లంకా దినకర్ ఆదేశించారు. అలాగే, 70 సంవత్సరాలు పైబడిన వారు పెద్ద వయస్సు రీత్యా కార్డులను వారి వద్దకే వెళ్లి ప్రక్రియ పూర్తి చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
జిల్లాలో108 వాహనాలు, 104 వాహనాలు ద్వారా సేవలందుతున్నాయని.. 108 వాహనాలకు సంబంధించి రెస్పాన్స్ టైమ్ పట్టణాలలో 17 నిమిషాలు మరియు గ్రామాలలో 21 నిమిషాలు పడుతుందని అధికారులు తెలిపారు. 104 వాహనాల ద్వారా మండలాలకు చెందిన విలేజ్ హెల్త్ సెంటర్లకు మెడికల్ ఆఫీసర్లతో నెలకు రెండుసార్లు స్థానికులకు సేవలందిస్తున్నట్లు మరియు 102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు ద్వారా గర్భిణి స్త్రీలకు సేవలు అందించామని పేర్కొన్నారు.
విద్యా రంగం :
జిల్లాలో 2025 – 26 సంవత్సరానికి మొత్తం అన్నిరకాల ప్రభుత్వ పాఠశాలలో ( 1980 – హై స్కూల్: 482, ప్రైమరీ స్కూల్: 1358, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు: 140 ) మరియు కళాశాలలు (87 ) కలిపి మొత్తం 1.86 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలో ఎన్రోల్మెంట్ అయ్యింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 619 మంది అధ్యాపకులు నియామకం డీఎస్సీ ద్వారా 2024 అనంతరం డబుల్ ఇంజన్ సర్కార్ లో నియామకాలు జరిగాయి.
ప్రైవేట్ పాఠశాలల వివరాలు:
బేటీ బచావో బేటీ పడావో – 11 నుండి 14 సంవత్సరాల వయస్సు వారు మరియు 15 నుండి 18 సంవత్సరాల వయస్సు వారు మంది చొప్పున గ్రూపులు ద్వారా చదువు ఆవశ్యకత మరియు మంచి చెడు ప్రవర్తన పైన అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తల్లికి వందనం :
ఒంగోలు పార్లమెంట్ మరియు సంతనూతలపాడు శాసనసభ పరిధిలో 2.93 లక్షల మంది విద్యార్థులకు 255 కోట్లు సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
సమగ్ర శిక్ష అభియాన్ – సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర :
1015 ఎలిమెంట్రీ నుండి సెకండరీ విద్యా వరకు పాఠశాలలో 1.86 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు చదువుకు అవసరమైన 9.87 లక్షల నోట్ పుస్తకాలు, 12.78 లక్షలకు పైగా వర్క్ బుక్ మరియు టెక్స్ట్ పుస్తకాలు, 15.78 వేల ఆక్స్ఫర్డ్ మరియు ఇతర డిక్షనరీలు, 1.81 లక్షల విద్యార్థులకు బ్యాగ్, 1.81 లక్షల విద్యార్థులకు యూనిఫామ్ , 1.84 లక్షల షూ , 1.29 లక్షల బెల్ట్ పంపిణీ తదితర సౌకర్యాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సమగ్ర శిక్ష అభియాన్ కు అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిర్వహిస్తున్నాం.
మన బడి – మన భవిష్యత్తు – పీఎం శ్రీ యోజన:
1015 మోడల్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో మరియు 50 పీఎం శ్రీ స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్యం లక్ష్యంగా సురక్షిత త్రాగు నీరు, స్వచ్ఛత కోసం మరుగుదొడ్లు, భవనాల మరియు ఫర్నిచర్ ఆధునీకరణ నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా విద్యార్థుల ఆరోగ్య భద్రత మరియు పరిసరాల పరిశుభ్రత ధ్యేయంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్వహించ బడుతున్నాయి. మన బడి మన భవిష్యత్ - పీఎం శ్రీ కింద మొత్తం 50 స్కూళ్లకు 189 పనులకు 7.13 కోట్లు మంజూరు కాగా, ఇందులో 181 పనులను పూర్తి చేసి 7.07 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుఅధికారులు తెలిపారు.
జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో పీఎం శ్రీ పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది.
త్వరలో ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం – పీఎం పోషణ్ :
నాణ్యమైన సన్న బియ్యంతో జిల్లాలో జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 2,293 పాఠశాలలో 1.44 లక్షల మంది విద్యార్థులలో వారంలో 5 రోజులు కోడి గుడ్డుతో పౌష్టికాహార మధ్యాహ్నం భోజనం కేంద్ర ప్రభుత్వం పథకం పీఎం పోషణ తో అనుసంధానంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం మన జిల్లాలో అమలు అవుతుంది. మొత్తం 4036 వంట చేసే సేవలు అందిస్తున్నారు , 2349 మంది శానిటేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరియు 247 మంది నైట్ వాచ్ మెన్ లు పని చేస్తున్నారు.
2025 లో 10 వ తరగతి ఫలితాలు 86.63% మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు – మొదటి సంవత్సరం 55.40% మరియు రెండవ సంవత్సరం 77.60% ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో 100% ఫలితాలు వచ్చాయి.. 2026 ఫలితాలు ఇవ్వమని అధికారులను ఆదేశించడం జరిగింది.
జవహర్ బాల ఆరోగ్య రక్ష :
విటమిన్ A మరియు D టాబ్లెట్లు సంవత్సరానికి రెండు సార్లు, ఐరన్ మరియు పోషక విలువలు తగ్గి రక్తహీనత ఉన్న విద్యార్థులకు తగిన పోషక విలువలను అందించే కార్యక్రమం జరుగుతుంది.
స్వర్ణాంధ్ర సాధనకు సురక్షిత తాగునీరు అత్యంత అవశ్యమైన అంశమని.. జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి జగన్ గారి హయాంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించుకుని మొత్తం పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లడం జరుగుతోందని, పరిస్థితులకు అనుగుణంగా దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా అధికారులు సరైన సమాచారం, ప్రణాళికలతో సిద్ధం కావాలని సూచించినట్లు తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అమృత్ 1.0 మరియు అమృత్ 2.0 కింద 480 కోట్ల రూపాయల విలువైన పనులు నీటి సరఫరా పనుల ఆధునీకరణ ద్వారా 11.07 కిమీ గ్రావిటీ మెయిన్ నీటి పారుదల ద్వారా 25 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించి 575.32 కిమీ నీటి సరఫరా నిడివితో 50,840 ఇంటి కనెక్షన్ల కోసం 381.70 కోట్ల పనులు, మరో 42.72 కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పటివరకు త్రాగు నీరు అందుబాటులో లేని ప్రాంతాలకు 29 కిమీ నీటి సరఫరా నెట్వర్క్ పనులు మరియు కొప్పోలు వద్ద 55.89 కోట్ల రూపాయల వ్యయంతో 15 ఎంఎల్డీ ఎస్టీపీ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు, ఈ పనులను పూర్తి చేసి 2028 నాటికి 100% ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించే సంకల్పంతో స్థానిక ఎంఎల్ఏ దామచర్ల జనార్దన్ గారు పని చేస్తున్నారు, తగిన విధంగా అధికారులు నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు. పీఎం సూర్య ఘర్ పథకం అమల్లోనూ వేగం పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న కార్యక్రమాలను జిల్లా లో పటిష్టం గా అమలుచేయడంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అమలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, జిల్లా విద్యా శాఖాధికారి రేణుక, సిపిడిసిఎల్ ఎస్ఈ వెంకటేశ్వర రావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ నాగేశ్వర రావు, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈ ఈ సంజయ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.



