పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ లో ప్రత్యేక పరీక్షలు నిర్వహణ

ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ( పీఎం ఎన్ ఎం ఏ) లో గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తున్నట్లు తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తాళ్లూరు పీహెచ్సీలో మంగళవారం 25 మంది గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. బీ పీ, రక్త హీనత తదితర ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్స మందులు అందించారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజేష్ యాదవ్, సీహెచి రమణమ్మ, పీ హెచ్ ఎన్ వై విజయమ్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తూర్పుగంగవరం పీహెచ్సీ పరిధిలో పీఎం నురక్షిత మాతృత్వ అభియాన్ లో బాగంగా పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. ఆహార నియమాలు పాటించాలని, అంగన్వాడీలలో ఇస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని క్రమం తప్పకుండా వాడుకోవాలని కోరారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ వీ సుశీల, హెచ్ ఈ ఓ చంద్రశేఖర్, పీహెచ్ ఎన్ ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *