ఫ్లోరోసిన్ వ్యాధిపై అవగాహన కలిగి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని ప్రకాశం
జిల్లా ఫ్లోరోసిన్ కన్సల్ టెంట్ అధికారి వి అనిల్ కుమార్ అన్నారు. మండలంలోని శివరామపురం, తాళ్లూరు కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం తాళ్లూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సురక్షితమైన నీటిని తాగటం వలన ఫ్లోరోసిన్ బారిన పడకుండా ఉండవచ్చని చెప్పారు. నీటిలో ప్లోరోసిన్ అధికంగా ఉండే పండ్లపై గారలు ఏర్పడతాయని చెప్పారు. పలు కమ్యూనిటీ లలో కూడ ప్లోరోసిన్ పై అవగాహన కల్పించారు. విద్యార్థుల పండ్లను పరిశీలించారు. పాటించాల్సిన పలు జాగ్రత్తలు చెప్పారు. ఎవరైనా ప్లోరోసిన్ బాధితులు ఉంటే ఒంగోలు రిమ్స్ తగిన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. శివరామపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం నాగి రెడ్డి, ఎంపీ ప్రాధమిక పాఠశాల హెచ్ఎం రమాదేవి, కస్తూరిభా పాఠశాల ప్రిన్సిపాల్ సుజిత, పీహెచ్ఎన్ వై విజయమ్మ, ప్లోరోసిన్ ఎల్ టి అంజి రెడ్డి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
