బేగంపేట అక్టోబర్ 19(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ లోని గుడ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.అత్తాపూర్ కు చెందిన మహమ్మద్ యూసుఫ్ (48) డ్రైవర్ గా పనిచేస్తుంటాడు.పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్ కు సర్జరీ చేయించుకున్నాడు. డాక్టర్ లలిత చికిత్స అందించారు.17వ తేదీన గం 9ల శస్త్ర చికిత్స తర్వాత చికిత్స కోసం శ్యామ్ లాల్ బిల్డింగ్ లోని గుడ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స కోసం చేరాడు.చికిత్స పొందుతూ 18వ తేదీ రాత్రి గం 1లకు మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు,బందువులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహమ్మద్ యూనస్ మృతి చెందాడు అంటూ ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడం తో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.విషయం తెలుసుకున్న రాత్రి సమయంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.బేగంపేట పోలీసులు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.వివరాలు సేకరిస్తున్నారు.


