స్వచ్చ రథంకు పనికిరాని వస్తువులను, పాత కాగితాలను, పుస్తకాలను అందించి అవసరమైన వాటిని తీసుకోవచ్చని ఎంపీడీఓ పి అజిత చెప్పారు. రామభద్రా పురంలో శనివారం స్వచ్ఛ రథం తిరిగి 250 కిలోల పనికిరాని పుస్తకాలను, పాత వస్తువులను సేకరించారు. అనంతరం ఎంపీడీఓ తూర్పుగంగవరం సచివాలయం ను సందర్శించి నచివాలయ సిబ్బంది లక్ష్యాలను వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను ఇచ్చిన గడువు లోపు పూర్తి చేసేలా చక్కగా పనిచెయ్యాలని కోరారు.

