తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రపంచ మలేరియా దినోత్సవం ను పురష్కరించుకుని శనివారం పీహెచ్సీ వైద్యాధికారుల, ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తాళ్లూరులో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజేష్ యాదవ్, హెచ్ ఎస్ రవి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొని మలేరియాని తరిమి కొడదాము అంటూ నినాదాలు చేసారు. వైద్యులు దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. తూర్పుగంగవరంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఈఓ చంద్రశేఖర్ బాబు, హెచ్ వి నుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొని ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలు శు భ్రంగా ఉంచుకుని దోమల నివారణకు కృషి చెయ్యాలని కోరారు.

