అల్వాల్ ఏప్రిల్ 25
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయంగా మారిన మూడు చెట్లను అక్కడ నుంచి తొలగించి మరోచోట విజయవంతంగా నాటారు.
ఈ సందర్భంగా తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు మాట్లాడుతూ ట్రాఫిక్ నిర్వహణ చర్యల భాగంగా, అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెంపుల్ అల్వాల్ రోడ్డుపై సుమారు 20 సంవత్సరాల వయస్సు గల మూడు పెల్టోఫోరం చెట్లు వాహన రాకపోకలకు అడ్డంకిగా ఉన్నట్లు గుర్తించామన్నారు.వాటిని
అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సమన్వయంతో పాటు, అటవీ శాఖ మరియు జీహెచ్ఎంసీ యూబీడీ విభాగాల సహకారంతో,
డీసీపీ ట్రాఫిక్-1 పర్యవేక్షణలో చెట్లను అక్కడి నుంచి తొలగించి మరోచోట పునరుజ్జీవం కల్పించామన్నారు.సంబంధిత అధికారుల అనుమతులతో, ఈ మూడు పెల్టోఫోరం చెట్లను జాగ్రత్తగా అల్వాల్ హిల్స్‌కు మార్పిడి చేసామన్నారు. సురక్షితమైన మార్పిడి కోసం చెట్ల కొమ్మలను కత్తిరించి వాటిని అక్కడి నుంచి తరలించామన్నారు.
దీంతో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా సాఫీగా సాగుతుందన్నారు.ప్రయాణికుల భద్రత పెరిగింది పచ్చదనం కూడా కాపాడమని తెలియ జేశారు. అభివృద్ధి అవసరాలు మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతౌల్యం సాధించాలనే శాఖ నిబద్ధతకు ఇది నిదర్శనం అన్నారు.
మార్పిడి చేసిన చెట్లు ఆరోగ్యంగా పెరుగుతూ నిలకడగా ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేస్తామని ఏ సి పి తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


