బీఆర్‌ఎస్‌ నాయకుడు సత్యనారాయణను పరామర్శించిన ఎమ్మెల్యే తలసాని.

రాంగోపాల్‌పేట, ఏప్రిల్ 25,
(జే ఎస్ డి ఎం న్యూస్):
రాంగోపాల్ పేట బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు రామేశ్వరం సత్యనారాయణను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం పరామర్శించారు. రాంగోపాల్‌పేట డివిజన్ నల్లగుట్టకు చెందిన సత్యనారాయణ తండ్రి శంకర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని వారి నివాసానికి చేరుకుని, శంకర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, తన ప్రగాఢ సంతాపం తెలియజేయడంతో పాటు వారికి ధైర్యాన్ని చెప్పారు. ఈ పరామర్శలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, నాయకులు ఆంజనేయులు, కోటేశ్వర్ గౌడ్, సతీష్, గణేష్, అరుణ్ భట్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *