తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, తూర్పుగంగవరం గ్రామాల్లో శ్రీవాసవి కన్యకా పరమే శ్వరి జయంతి సందర్భంగా శ్రీవాసవికన్యకా పరమేశ్వరి దేవాలయాల్లో ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆయాడేవాలయాలందు ఉదయం నుండే సుప్రభా తంతో గోపూజ, విశేష పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం,లలిత సహస్రనామ పారా యణం, నిత్యార్చన, నీరాజన మంత్రం, సామూహిక కుంకుమార్చన వంటి కార్యక్ర మాలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణతో వాసవీమాతను అలంక రించి, భక్తులకు మంగళహారతు లిచ్చి తీర్థప్రసాదాలు అందించారు. అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.
