ప్రకాశం జిల్లాలో ఇంధన సరఫరాపై ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫ్యూయల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంధన కొరత, అధిక ధరలు, నాణ్యత సమస్యలపై ప్రజలు నేరుగా 1077 టోల్ ఫ్రీ నంబర్‌కు 24 గంటలు ఫిర్యాదులు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
