బేగంపేట అక్టోబర్ 20(జే ఎస్ డి ఎం న్యూస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిజెపి తప్పకుండా విజయం సాదిస్తూందని మాజీ మంత్రి, బీ జే పి సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.బేగంపేట మోతీలాల్ నెహ్రూ నగర్ లోని బి జె పి కార్యాలయంలో మర్రి దీపావళి పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి పూజ చేసారు.
ఈ కార్యక్రమములో మర్రి శశిధర్ రెడ్డి తో పాటు మర్రి పురురవ రెడ్డి తో పాటు నియోజకవర్గ ముఖ్య బిజెపి నాయకులు పాల్గొన్నారు. పూజ కార్యక్రమము అనంతరం మర్రి శశిధర్ రెడ్డి, మర్రి పురురవ రెడ్డి కి స్థానిక బిజెపి నాయకులు దీపావళి శుభాకాంక్షలనుతెలియజేసారు.ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రంలో బిజెపి తన సత్తా చాటుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ , బీ జే పి ప్రజలకు దగ్గర అయినదన్నారు. రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వ మని తెలియజేసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిజెపి అత్యధిక మెజారిటీతో విజయం సాదిస్తూందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమములో మాజీ కార్పొరేటర్ వసంత నర్సింగ్ యాదవ్ , ఇతర బిజెపి సీనియర్ నాయకులు వజనాల దయానంద్ రావు, నక్క శ్రీనివాస్ గౌడ్ , నెమలి ఆనంద్ కుమార్ (నందు) , యం. మహేష్ , పి. నరేందర్ , గుంటి సత్యనారాయణ , అంబాలా ఈశ్వర్ బాబు , శ్రీనివాస్ రెడ్డి , వంశీ కృష్ణ , సి . కె. నర్సింగ్ రావు , విష్ణు , ఆకుల రమేష్ , యం. రఘునాథ్ గౌడ్ , శ్రీమతి కిరీటా , బి. వికాస్ , చంద్ర పాల్ రెడ్డి , కె. నరేష్ , సి. కె. శ్రవణ్ , బొజ్జ నర్సింగ్ రావు , శ్రీ మాన్ తదితరులు పాల్గొన్నారు .

