శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యులు, మహానాడు మీడియా ఎండీ బోడేపూడి వెంకట సుబ్బా రావు సోమవారం టిడిపి దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా బోడేపూడిని డాక్టర్ లక్ష్మి అభినందించి సత్కారం చేసారు. టిడిపి డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల లలిత వెంకటేశ్వర రావు, వాసి రెడ్డి రవి, జర్నలిస్ట్ రవి చంద్ర, గోనుగుంట హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.
