తుఫాన్ తగ్గేవరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు మొంథా తుఫానుపై ప్రకాశం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో మంత్రి డా.స్వామి సమీక్షించారు. కలెక్టర్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాన్ ప్రభావాన్ని, అధికార యంత్రాంగం ఏర్పాట్లు మంత్రి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తుఫానుపై సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు. తుఫాన్ తగ్గేవరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి.
ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి.అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యశాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు నీరు, ఆహారం, పాలు అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచాలి. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, జాగ్రత్తగా ఉండాలని
మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి సూచించారు.
