పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. తాళ్లూరు పీహెచ్సీలో ఆదివారం వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ తో
కలిసి జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఐదేళ్ల లోపు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా కోరారు. వైద్యులు డాక్టర్ రాజేష్ యాదవ్, సీహెచ్ ఎవీ రమణమ్మ, పిహెచ్ఎన్ విజయమ్మ, నూపర్ వైజర్ రవి, మాలతి, ఫార్మాసిస్ట్ రమేష్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాళ్లూరు పీహెచ్ సి పరధిలో 98.6 శాతం అనగా 2192 మంది గాను 2162 మందికి పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు వైద్యాధికారి ప్రవీణ్ తెలిపారు.



తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో….
తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో 97.11శాతం విజయవంతం అయినట్లు పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మౌనిక తెలిపారు. 2741 మందికి గాను 2662 మందికి పోలియో చుక్కలు వేసినట్లు చెప్పారు. రెండు రోజుల పాటు డోర్ టు డోర్ సర్వే చేసి మిగిలిన శాతం కూడ విజయవంతం చెస్తామని చెప్పారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఓ చంద్రశేఖర్
బాబు, పీహెచ్ఎన్ రమణమ్మ, హెచ్ వి నుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
