విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పి రాజ బాబు అన్నారు. జిల్లా పరిషత్ నిధులలో ఉచిత విద్యా సామగ్రిని పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజా బాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. పదవ తరగతి మీ భవిష్యత్ అని అన్నారు. డిఆర్ చిన ఓబు లేసు మాట్లాడుతూ విద్యార్థులు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. పరీక్షల పట్ల భయం వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు. సాంఘిక సంక్షేమశాఖ డిడీ ఎన్ లక్ష్మా నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలలో ఉన్న 2019 మంది విద్యార్థులకు విద్యా సామగ్రిని అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థుపై ప్రత్యేక శ్రర్థ వహించాలని కోరారు.


