ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహణ

నూతన సంవత్సర వేడుకలు మండలంలో ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు.
తాళ్లూరు, తూర్పుగంగవరం లలో యువకులు కేరింతలు కొడుతూ నందడి చేసారు. మహిళలు ఎక్కువగా దైవ సన్నధిలో గడపటానికి ఇష్టపడ్డారు. రాజకీయ నాయకులు ఆయా పార్టీల అధినాయకులను కలసుకుకుని శు భాకాంక్షలు తెలిపారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక రంగ సంస్థ డైరెక్టర్ ఓబులు రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, కరువది డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, రమేష్, శ్రీను, నాగేశ్వర రావులు తహసీల్దార్ రమణా రావు, ఎంపీడీఓ అజితలను కలసి నన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ సుబ్బయ్య, ఎస్. ఐ మల్లిఖార్జున రావు, వైద్యాధికారి ప్రవీణ్, తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక లను ఉపాధ్యాయులు, ఆయా కార్యాలయాల సిబ్బంది కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దర్శి, చీమకుర్తి, ఒంగోలు తరలివెళ్లి ఆయా పార్టీల అధినాయకులను కలిసారు. ఉత్సాహంగా పలు పాఠశాలల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దర్శి నియోజక వర్గ కేంద్రమైన దర్శికి తరలివెళ్లి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ ను కలిసి నూతన సంవత్సరశుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలను ఆపార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మాజీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిలు , అధిక సంఖ్యలో నాయకులు కలిసి ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *