హైకోర్టు ఉత్తర్వులతో ఉపాధి పనులు చేసిన నిర్వహకులకు బిల్లులు చెల్లింపు- గతవైసీపీ ప్రభుత్వంలో చెల్లింపులు కాక కోర్టు ధిక్కార కేసుకు వెళ్లటంతో నిధులు చెల్లింపులు

2014-2019 మధ్యకాలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో విఠలాపురం, బొద్దికూర పాడు గ్రామపంచాయతీ లో అభివృద్ధిపనులు చేపట్టిన నిర్వహకులకు హైకోర్టు ఆదేశానుసారం శుక్రవారం సాయంత్రం సంబంధిత బిల్లులు చెల్లింపు చేశారు. విఠలాపు రం, బొద్దికూరపాడు పంచాయతీ లో పనులు చేపట్టిన ముగ్గురు నిర్వహకులకు రూ. 56లక్షల 74వేల 810లు అందజేశారు. విఠలాపురం పంచాయతీ లో అప్పటి టీడీపీ పాలనలో మానం రమేష్ బాబు, షేక్ కాలేషావలిలు , బొద్దికూరపాడు లో మాజీ సర్పంచ్ పులి వెంకట కృష్ణారెడ్డిలు ఎన్ఆర్ ఈజిఎస్ పనులు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో ఉపాధి పనుల పథకం కిందచేపట్టిన అభివృద్ధి పనుల తాలూకూ కొన్ని పనులుకు నిధులు చెల్లించలేదు. దీంతోవారు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా పనులు చేపట్టిన తాలూకు నిధులు చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఐనప్పటికి అప్పటి వైసీపీ ప్రభుత్వం నిధులు చెల్లించలేదు. దీంతో మానంద మేష్ బాబు ,
,షేక్ కాలేషావలి, పి.కృష్ణారెడ్డిలు ప్రభుత్వంపై బిల్లుల చెల్లింపుల విషయమై హైకోర్టుకు కోర్టు ఆదేశాల ధిక్కార కేసుకు వెళ్లారు . రాష్ట్రం ప్రభుత్వం గతవైసీపీ ప్రభుత్వం వల్ల బిల్లులు చెల్లింపులు జరుగని వారిపట్ల సానుకూలంగా స్పందించి 2014-2019 మద్యకాలంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులుబిల్లులు అందక ఇబ్బందులు పడుతున్న వారికి తక్షణమే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వులు,ఆశాఖ
ఉన్నతాధికారుల ఆదేశానుసారం బిల్లుల చెల్లింపు చర్యలు చేపట్టారు. విఠలాపురం పంచాయతీ నందుమానం రమేష్ బాబు కు రూ12,81,807లు, షేక్ కాలేషా వలి రూ19,28,070లు, పులి కృష్ణారెడ్డికి రూ24,64,933లను జిల్లా ఎన్ఆర్ ఈజిఎస్ పంచాయతీ అకౌంట్ కి శుక్రవారం సాయంత్రంజమచేశారు. నిర్వహకుల వద్ద’ వున్న ఎన్టీవోల ఆధారంగా బిల్లుల తాలూకు చెక్కులను పనులు చేపట్టిన నిర్వహకులకు అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవోపి.అజిత, పంచాయతీ కార్యదర్శులు షేక్ షహనాజ్ బేగం, డి.నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *