క్యూ ఆర్ కోడ్ తో హద్దుల స్పష్టతతో కూడిన పాస్ పుస్తకాలు రైతులకు ఎంతగానే ఉపయోగపతాయని జిల్లా డిప్యూటీ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి ఎ కుమార్ అన్నారు. మల్కాపురం పంచాయితీలో శనివారం నూతనంగా మంజూరు అయిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నర్పంచి వలి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాన్ పుస్తకాల వలన రైతులకు భరోసాతో కూడిన ఆస్తి తన స్వంతం అన్న భావన ఉంటుందని చెప్పారు. రీ సర్వే జరిగిన మల్కాపురంలో 490 ఖాతాలు ఉండగా కేవలం 90 మందికి పాన్ పుస్తకాలు వచ్చినట్లు రైతులు చెప్పారు. తహసీల్దార్ రమణా రావు మాట్లాడుతూ రీ సర్వేలో నూతన సాంకేతికతో కొంత మేర తప్పులు జరిగాయని వాటిని త్వరలో నరిదిద్దితామని చెప్పారు. ఎఎంసీ డైరెక్టర్ కాలేషా వలి, రీ సర్వేటిడి ప్రశాంత్, ఆర్ .ఐ సుధీర్, ఎంపీటీసీ మేడగం వెంకట రామి రెడ్ది, విఆర్డీఓ నాగూర్ బి పాల్గొన్నారు.

