యువత వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల ద్వారా తమ ప్రతిభను వెలికి తీయాలి….. మాజీ ఎన్ డి ఎం ఏ ఉపాధ్యక్షులు, బిజెపి నాయకులు మర్రి శశి ధర్ రెడ్డి.

బేగంపేట జనవరి 4 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
యువత వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా తమలోని ప్రతిభను వెలికి తీయాలనే ప్రధాని ఆలోచన ఎంతో ప్రశంసనీయమని, మాజీ ఎన్ డి ఎం ఏ ఉపాధ్యక్షులు, బిజెపి సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన సంసద్ ఖేలో మహోత్సవ్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షుడు మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం బేగంపేట పోస్ట్ ఆఫీస్ ముందు క్రికెట్ ,ఖో ఖో,కబడ్డీ టగ్ ఆఫ్ వార్, వాలీబాల్ ,100 మీటర్ల పరుగు పందెం పోటీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సెంటర్ ను ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఇన్చార్జ్ నందనం దివాకర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీశైలం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్, జిల్లా మాజీ కార్యదర్శి అశోక్ యాదవ్ ,జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సి విజయ్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి బాబురావు ,మహిళా మోర్చా అధ్యక్షురాలు సంధ్య లక్ష్మీ ,వైస్ ప్రెసిడెంట్లు వెంకటేష్, పాండియన్, నాగేష్, వేణు, గణేష్ ,క్రాంతి, ఆనంద్, రామచందర్ ,ఎండి ఐషక్, స్వామి తది తరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *