క్రిస్మస్ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కుల పంపిణీ చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్.

కంటోన్మెంట్ జనవరి 4
(జే ఎస్ డి ఎం న్యూస్)
రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని చర్చ్ లకు పండుగ కానుకగా అందించే ఆర్ధిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో చర్చ్ లకు మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం పికెట్ లోని ఎమ్మెల్యేక్యాంపుకార్యాలయంలో సంబంధిత అధికారులతో కలిసి చర్చ్ పాస్టర్ లకు అందించారు . ఈ సందర్భంగా పాస్టర్లు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పాస్టర్లతో మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని, దానిలో భాగంగానే క్రిస్మస్ పండుగను మరింత ఆనందంగా ,ఉత్సాహంగా జరుపుకోవడానికి ప్రభుత్వం తరఫున చర్చ్ లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు.నియోజకవర్గంలో ఉన్న చర్చ్ లకు ఆర్ధిక సహాయం అందించిన ప్రభుత్వాన్ని మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సత్కరించిన వార్డు 2 అధ్యక్షులు శాంసన్ రాజు….
రాష్ట్ర ప్రభుత్వం తరుపున కంటోన్మెంట్ నియోజక వర్గంలోని చర్చలకు ఆర్ధిక సహాయం చెక్కులు అందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కంటోన్మెంట్ వార్డు 2 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,సీనియర్ నాయకులు శాంసన్ రాజు సత్కరించారు.ముందుగా ఎమ్మెల్యేకు శాలువా,పుష్ప గుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేశారు.కంటోన్మెంట్ అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు శాంసన్ రాజు కృతఙ్ఞతలు తెలియ జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *