జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో బాగంగా సోమవారం ఉప రవాణా కమీషనర్ కార్యాలయంలో కిమ్స్ వైద్యులు రామాంజనేయులు, విజయలక్ష్మిల ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి, గుండే పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. 200 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. ఎం వీ ఐ లు ఎల్ సురేంద్ర ప్రసాద్, జయ ప్రకాశ్, ధర్మేంధ్ర, భాను ప్రకాశ్, జస్వంత్, ఎవో శ్రీనివాసులు పాల్గొన్నారు.
