శివరామపురం పంచాయితీలో గత గ్రామ కార్యదర్శి రాజా రమేష్ సమయంలో నిధులు
దుర్వినియోగంపై బుధవారం విచారణ నిర్వహించారు. గ్రామ ఉప నర్పంచి నారిపెద్ది రామ్మూర్తి స్పందనలో వినతి ఇవ్వగా డివిజన్ డవలప్ మెంట్ అధికారి సువార్తమ్మ విచారణ అధికారిగా వచ్చి సర్పంచి వర్గీయులు, అధికారుల నుండి వివరణ తీసుకుని రికార్డులను పరిశీలించారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామనని చెప్పారు. ఎంపీడీఓ అజిత, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ లక్ష్మి నారాయణ, ఉప సర్పంచి నారిపెద్ది రామ్మూర్తి, గ్రామ కార్యదర్శి షేక్ షహనాజ్ బేగం పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను, ఎన్ డబ్ల్యు పీసీ కేంద్రాన్ని పరిశీలించారు.
