బాల్య వివాహాల నివారణే- సమాజ బాధ్యత. జువైనల్ లీగల్ అడ్వైజర్, కే.రత్న ప్రసాద్

బాల్య వివాహాలు బాల్య బాలల భవిష్యత్తును నాశనం చేసే సామాజిక దురాచారం, విద్యార్థిని, విద్యార్థులకు ఫోన్ వాడకం ద్వారా వచ్చే నష్టాల గురించి,గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ అనే అంశాలు అంశం మీద అవగాహన కలిగించడం ద్వారా లైంగిక దోపిడీ చాలావరకు అరికట్టవచ్చని జిల్లా జువైనల్ లీగల్ అడ్వైజర్ కె. రత్న ప్రసాద్ అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు అధ్యక్షతన తాళ్లూరు మండలం, తాళ్లూరు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం నందు “బాల్య వివాహం చట్టరీత్య నేరం” అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడినారు. జిల్లా బంగారు బాల్యం, నీతి అయోగ్,జిల్లా ప్రాజెక్టు అసోసియేట్ పి. సిద్ధిక్ మాట్లాడుతూ బాల్య వివాహాల వలన బాలికల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం మరియు విద్యా అవకాశాలు పూర్తిగా కోల్పోతారని, 18 సంవత్సరాల లోపల గల బాలురకు, బాలికలకు అని తేడా చెప్పకుండా,బాల్య వివాహ నిషేధ చట్టం -2006 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అలాంటి బాల్య వివాహం జరిపించిన తల్లిదండ్రులు, సంరక్షకులు,పెళ్లి పెద్దలు, మధ్యవర్తులు, పురోహితులు సహ సంబంధిత వారిపైన జరిమానా జైలు శిక్షలు విధించే అవకాశం ఉందని ఆయన అన్నారు. తాళ్లూరు ప్రాథమిక వైద్యశాల డాక్టర్ పి ప్రవీణ్ మాట్లాడుతూ బాలికలు క్రమం తప్పకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, శారీరిక దృణత్వాన్ని పెంపొందించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యం వైపు పయనించాలి మరియు బాలల హక్కులను కాపాడటం ప్రతి పౌరుడు బాధ్యత అని బాల్య వివాహల వైపు తల్లిదండ్రులు దృష్టి సాధించకుండా వారు చదువు కొరకు తోడ్పడాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు 1,2 సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *