ప్రసన్నాంజనేయస్వామి కి కొత్త పాలెం వాసి రామకోటి రెడ్డి రూ.1,11,111 లు విరాళం -దాతలను ఘనంగా సన్మానించిన దేవస్థాన కమిటీ అధ్యక్షుడు సభ్యులు, అధికారులు

శింగర కొండ ప్రసన్నాంజనేయ స్వామి వారికి తాళ్లూరు మండలం కొత్త పాలెం వాసి, సీనియర్ రాజకీయ నాయకుడు కైపు రామకోటి రెడ్డి కుటుంబం రూ. 1,11,111లు విరాళం అందించారు. కైపు రామకోటి రెడ్డి ధర్మ పత్ని నాగలక్ష్మి, వారి కుమారుడు హరీశ్వర రెడ్డి దంపతులు వారి కుమార్తె చిన్నారు నాగ దివ్యలు విరాళాన్ని స్వామి వారికి అందించారు. దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ రావు, అసిస్టెంట్ కమీషనర్ మదమంచి తిమ్మ నాయుడు, సభ్యులు అరబోలు నాగమ్మ సమక్షంలో ఈ విరాళం చెక్కును దాతలు రామ కోటి రెడ్డి కుటుంబం అందించారు. ప్రకార మండపాలు, రాజ గోపురం నిర్మాణం నిమిత్తం ఈ విరాళం అందించినట్లు దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ తెలిపారు. దాతల కుటుంబానికి స్వామి వారి శేషవస్త్రం స్వామి వారి పటం అందించి ఘనంగా సన్మానించారు. ప్రత్యేక పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *