కంటోన్మెంట్ జనవరి 23 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని జిహెచ్ఎంసి లో విలీనం చేయాలంటూ గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు పలువురి మద్దతు లభిస్తుంది. శుక్రవారం రోజు టి పి సి సి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ శ్రీ గణేష్ దీక్షకు మద్దతు తెలియజేశారు. మధు యాష్కీ గౌడ్ తో పాటు కి తో పాటు వివిధ వర్గాలకు చెందినవారు ఆయన దీక్షకు మద్దతు తెలియజేశారు. కంటోన్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం కోసం ఢిల్లీ స్థాయిలో తన వంతు ప్రయత్నం చేస్తానని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, ఏఐసీసీ నాయకులు మధు యాష్కీ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మొదలుపెట్టిన రిలే నిరాహార దీక్షకు 4 వ రోజు తన సంఘీభావం తెలియజేసామన్నారు. కంటోన్మెంట్ బోర్డు విలీనం అనేది కంటోన్మెంట్ ప్రజల న్యాయమైన డిమాండ్ అని, ఈ దీక్షకు నా పూర్తి సంఘీభావం, మద్దతు తెలియజేస్తున్ననని అన్నారు. కంటోన్మెంట్ ప్రజల డిమాండ్ ను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్తానని, ఎమ్మెల్యే శ్రీగణేష్ ను వెంటబెట్టుకుని రాహుల్ గాంధీ , దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ ప్రాంతాల యంపీలను కలుస్తామన్నారు. పార్టీలకతీతంగా అన్ని ప్రాంతాల కంటోన్మెంట్ యం.పి లతో రక్షణ శాఖ మంత్రి ని కలిసి విజ్ఞప్తి జేస్తామని, నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తే కంటోన్మెంట్ లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
ఈ రిలే నిరహార దీక్షకు మధు యాష్కీ గౌడ్ తో పాటు టిపిసిసి మాజీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధర్, అన్నా నగర్ ఆటో యూనియన్ నాయకులు, రసూల్ పుర కస్తూర్బా స్కూల్ ఉపాధ్యాయులు, వికాస్ మంచ్, తాడు బంద్ ముస్లిం గ్రేవ్ యార్డ్ కమిటీ , నియోజకవర్గం లోని పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ మద్దతును తెలిపి నిరాహార దీక్షలో పాల్గొన్నారు.


