కంటోన్మెంట్, ఫిబ్రవరి 3
(జె ఎస్ డి ఎం న్యూస్) :
భక్తుల కోలాటం, బాణా సంచా మోతలు,మేళ తాళాల మధ్య బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీ శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు నమో వెంకటేశా,ఆపదమొక్కులవాడా ,అనాధ రక్షక అంటూ స్వామివారి నామాన్ని పటిస్తూ ముందుకు సాగారు.దాత ఆలయానికి నూతనంగా అందించిన రథంలో స్వామివారు అమ్మవార్లతో కలిసి గరుడ సేవ తో ఊరేగింపు లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో పురవీధుల గుండా యాత్ర సాగింది. స్వామివారిని దర్శించుకునేందుకు కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు రోడ్లకు ఇరువైపులా స్వామివారికి హారతులు ఇస్తూ స్వాగతించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయాన్ని వివిధ రకాలైన పూలతో రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. రథయాత్రలో కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బోర్డు మాజీ సభ్యురాలు జంపన విద్యావతి రధం దాత సుమంత్ రెడ్డి దంపతులు ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పవన్ కుమార్ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు ఆర్ నారాయణ ఉపాధ్యక్షులు రామ్మోహన్రావు కార్యదర్శి యాదయ్య ఉప కార్యదర్శి ఆత్మానంద రెడ్డి కోశాధికారి లక్ష్మణ్ కార్యవర్గ సభ్యులు మోహన్ రావు జగన్నాథం నరసింహారావు సాంబశివరావు పెంటారెడ్డి ధర్మ వీర్ తదితరులు పాల్గొన్నారు.
రథోత్సవం సందర్భంగా కోలాటం….
స్వామివారి రథోత్సవం సందర్భంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాట మాడారు.యువత ,మహిళలు
రథాన్ని లాగుతూ స్వామి వారిపై భక్తిని ప్రదర్శించారు.ఆలయం నుంచి పుర వీధుల గుండా సాగిన రథయాత్ర తిరిగి ఆలయానికి చేరుకుంది.




