హైదరాబాద్, ఫిబ్రవరి 3
(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారి పట్ల హైదరాబాద్ సిటీ పోలీసులు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్నారని, అకృత్యాలకు పాల్పడే వారు చట్టం నుండి తప్పించుకోలేరని ఉమెన్ సేఫ్టీ వింగ్ డిసిపి పి.లావణ్య నాయక్ జాదవ్ స్పష్టం చేశారు. మైనర్ బాలికలపై జరిగిన ఐదు వేర్వేరు లైంగిక నేరాల కేసుల్లో కోర్టులు నిందితులకు కఠిన శిక్షలు ఖరారు చేశాయని ఆమె వెల్లడించారు.సంచలనం సృష్టించిన కేసుల్లో కోర్టు తీర్పులు బేగంపేట, బంజారాహిల్స్, భవానీ నగర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఐదు పోక్సో కేసుల్లో సెషన్స్ కోర్టులు మరియు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఈ క్రింది విధంగా తీర్పులువెలువరించాయన్నారు.జీవితకాల ఖైదు .
12 ఏళ్ల కన్నకూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టిన తండ్రికి ‘మరణించే వరకు కఠిన కారాగార శిక్ష’ విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చిందన్నారు.
25 ఏళ్ల కఠిన శిక్ష:వి9 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 25 సంవత్సరాల జైలు శిక్ష పడిందన్నారు.
20 ఏళ్ల జైలు శిక్ష 8 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడిందన్నారు.
5 ఏళ్ల శిక్ష (రెండు కేసులు) 4 మరియు 8 ఏళ్ల చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులకు చెరో 5 సంవత్సరాల శిక్ష ఖరారైందన్నారు.
బాధితులకు పరిహారం: జైలు శిక్షలతో పాటు, బాధితులకు రూ 2,00,000 నుండి రూ5,00,000 వరకు పరిహారం అందించాలని కోర్టు ఆదేశించిందనీ డి సి పి వెల్లడించారు.
భరోసా కేంద్రం కీలక పాత్ర:
ఈ కేసుల విచారణలో ‘భరోసా కేంద్రం’ అందించిన సేవలను డిసిపి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాధితులకు మరియు వారి కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని అందించడంతో పాటు, న్యాయపరమైన సలహాలు, వైద్య సహాయం మరియు కోర్టు విచారణలో నిరంతర మద్దతునిచ్చిందని ఆమె తెలిపారు. నిందితుల నుండి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా కేసులనుముగింపు వరకు తీసుకెళ్లడంలో భరోసా సిబ్బంది చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు.
సమిష్టి కృషితోనే విజయం.
ఈ విజయం దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు లైజన్ ఆఫీసర్లు మరియు కోర్టు డ్యూటీ సిబ్బంది సమన్వయ కృషి వల్లే సాధ్యమైందని డిసిపి తెలిపారు. మహిళలు మరియు చిన్నారుల రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో నిరంతరం పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. నిందితులకు శిక్షలు పడేలా చేసిన అధికారులను ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అభినందించారు.
చిన్నారులపై అకృత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు…డిసిపి పి లావణ్య నాయక్ జాదవ్.5 వేర్వేరు కేసుల్లో నిందితులకు భారీ జైలు శిక్షలు జరిమానా.భరోసా కేంద్రం అండతో బాధితులకు సత్వర న్యాయం.
03
Feb