ఓల్డ్ బోయిన్పల్లి, ఫిబ్రవరి 8 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఓల్డ్ బోయిన్ పల్లి పరిధి లోని హస్మత్ పెట్ ఎస్సీ బస్తీ వీకర్స్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం కోసం ఆదివారం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ భూమి పూజ చేశారు.రూ15 లక్షలు నిధులను వెచ్చించి ఈ నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ ప్రాంతంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ,కార్పొరేటర్ ముద్దం దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ముద్దం వెంటనే విద్యుత్ స్తంభాలను మార్చి వీధి దీపాలను అమర్చాలని అధికారులకు సూచించారు. డ్రైనేజీ కొత్త లైన్ ,సిసి రోడ్డు త్వరలోనే వేయిస్తానని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలోజి హెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్
ఎస్సీ బస్తీ అధ్యక్షులు గడ్డం నర్సింగరావు, సెక్రెటరీ బుర్రి యాదగిరి, దేవేందర్ రాజు, మైపాల్ రెడ్డి, రాజు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్,పద్మలత ,సుమ, యాదమ్మ, హంస బాయ్, విజయలక్ష్మి, లక్ష్మీనరసమ్మ,. సాయికుమార్ , పూర్ణ, ప్రసాద్, కుమార్, ప్రవీణ్, బాలు, దినేష్, సురేందర్, రాజు,ప్రభాకర్, పవన్, ఎల్లేష్, మొండయ్య, కరుణాకర్, కొమురయ్య, బస్తి మహిళలు బస్తివాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
