ఒంగోలు పీ వి ఆర్ ఉన్నత పాఠశాలలో జరిగిన బాలోత్సవంలో సాంస్కృతిక విభాగంలో బొద్దికూరపాడు జిల్లా పరిషత్, ప్రాధమిక పాఠశాల విద్యార్థులు కోలాటం ప్రదర్శించి, సాంప్రదాయ నృత్యం ప్రదర్శించి నభికులను ఆకట్టుకున్నారు. విద్యార్థులను తీర్దిదిద్దిన ప్రధానోపాధ్యాయులు సుబ్బా రావు, నుబ్రమణ్యా చారి, పద్మజ కోలాటంలో శిక్షణ ఇచ్చిన విష్ణు ప్రియను, ప్రొత్సహించిన ఉపాధ్యాయులు పోలంరెడ్డి సుబ్బా రెడ్డికి తల్లిదండ్రులను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత, రిటైర్డ్ హెచ్ఎం ఎన్ అంజి రెడ్డి అభినందించారు. నృత్యం అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ అభినందించారు.

