కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాలంటరీ టీచర్లకు బోధనాభ్యసన సామాగ్రి గురువారం పంపిణీ చేశారు.
దర్శి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల వెలుగు ఏపిఎమ్ లకు వయోజన విద్య పర్యవేక్షకులు వై చౌడిరెడ్డి అందజేశారు. రాత్రి బడికి హాజరయ్యే అభ్యాసకులు రాతపని కోసం పెన్సిళ్లు, షార్పనర్లు, ఎరేజర్లు అందజేశారు. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు, వర్కుబుక్కులు పంపిణీ చేశారు.
తాళ్లూరు వెలుగు కార్యాలయంలో జరిగిన పంపిణీ కార్యక్రమం లో ఏపిఎమ్ దేవరాజు, సిసిలు మోహన్, వెంకటేష్, విఓఏ లు ఉన్నారు.
ముండ్లమూరు లో సిసిలు సుచేంద్ర, వెంకట రత్నమ్మ, అకౌంటెంట్ మార్తమ్మ, దర్శి వెలుగు కార్యాలయంలో సిసిలు ఫణిబాబు, కోటమ్మ, అకౌంటెంట్ కుమారి, కురిచేడు ఏపిఎమ్ సీమోను, సిసి గురవయ్య, దర్శి మెప్మా అకౌంటెంట్ సురేష్, పలువురు విఓఏ లు పాల్గొన్నారు.
