మహాశివరాత్రి పురస్కరించుకుని దర్శి పట్టణం, అద్దంకి రోడ్ లోని శివాలయం దేవస్థానం వద్ద శివాలయం లో విశేష పూజలు నిర్వహించి తదుపరి అలంకరించబడిన రథంపై శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపుగా రథాన్ని లాగి ప్రారంభించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – లలిత్ సాగర్ దంపతులు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య దేవస్థాన చైర్మన్ నారపుశెట్టి శివ, దర్శి సీ ఐ రామారావు , ఎస్ ఐ మురళి, తహశీల్దార్ శ్రవణ్ కుమార్ కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు. శివపార్వతుల రథ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శివనామ స్మరణ తో మార్మోగిన దర్శి పట్టణం లోని పురవీధులలోరథాన్ని లాగడం భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిగా మరియు పుణ్యకార్యంగా చేపట్టారు .ఈ కార్యక్రమం లో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి శ్రేణులు, మహిళలు, దర్శి పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు .



