ప్రజల పక్షాన ప్రశ్నిస్తా….-ఇది నా వ్యక్తిగతం పార్టీకి సంబంధం లేదు – మీడియా సమావేశంలో మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకులు బాలినేని – జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన బాలినేని

ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన తాను ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటానని, ఇది తన నైజం అని, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒంగోలులోని తన నివాసంలో శుక్రవారం బాలినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ వైసిపి అధికారంలో ఉన్నప్పుడుఅవినీతి చేసిన వెధవలపై చర్యలు తీసుకోలేదన్నారు.డ్వాక్రా గ్రూపుల్లో 100 కోట్లు అవినీతి జరిగింది. దాంట్లో మా అబ్బాయికి సంబంధం అని వార్తలు రాశారన్నారు.డ్వాక్రా సంఘాల్లో జరిగిన అవినీతి అక్రమాలు, వైసీపీలో ఉన్నప్పుడు జరిగిన వాటి మీద సంవత్సర కాలంగా ఇప్పుడు జరిగిన వాటి మీద విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.బ్రాహ్మణ స్థలాలు మేము కబ్జా చేసేవాన్ని ఆరోపణలు చేశారు.ఇప్పుడు ఆ స్థలాలు ఎవరు కబ్జా చేశారు. ఆ స్థలాలపైవిచారణ చేయించాలన్నారు.మెప్మాలో జరిగిన అవినీతిని బయట పెట్టాలన్నారు.ఇంట్లో వ్యక్తి లెటర్ రాసి అందరికీ పెడితే అతని ఇంటికి తీసుకెళ్ళి రాజీ చేసుకున్నారన్నారు.నేను హైదరాబాదులో ఉండి నేను రాయించానని ఆరోపించారని అన్నారు.తాము ఎంతో మానసిక శోభ అనుభవించామన్నారు.ఇసుక గ్రావెల్ లూటీ చేస్తున్నారు. భూకబ్జాలపై పూర్తి వివరాలు చంద్రబాబు నాయుడుకి లెటర్ ఇస్తానన్నారు.భూకబ్జాలపై పోరాటం చేస్తాను భూకబ్జాలు జరగనివ్వనన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *