సెర్ప్ నిబంధనల మేరకు ప్రస్తుతం తీసుకున్న స్త్రీనిధిరుణాల బకాయిలు చెల్లించ కుంటే క్రిమినల్ చర్యలు తీసుకోబోవటంలో వెనుకాడబోమని జోనల్ డీజీఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక వెలుగుకార్యాలయంలోమండల సమాఖ్య అధ్యక్షురాలు మారాబత్తుల సుజాత అధ్యక్షన శుక్రవారం మండల సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ మండలలో స్త్రీనిధి బకాయి లను దీర్ఘకాలంగా చెల్లించలేదన్నారు. దీని వల్ల మిగిలిన పొదుపు మహిళలు , రుణాలు పొందేందుకు అవరోధంగా మారిందన్నారు. స్త్రీనిధి రుణాలు తీసుకున్న కొందరు మహిళలు చెల్లింపులో జాప్యం చేయటం, చెల్లింపు గురించి పట్టించుకో పోవటం వల్ల బకాయిలు ఎన్ పి ఎల్ లో పడ్డాయన్నారు. దీనివల్ల ఈమండలానికి స్త్రీనిధిరుణాలు నిలిచిపోయినట్లు తెలిపారు. గ్రామసంఘాలు కూడా స్త్రీనిధి
స్త్రీనిధిరుణాలు నిలిచి పోయినట్లు తెలిపారు.
గ్రామసంఘాలు కూడా స్త్రీనిధి రుణాలు తీసుకున్న మహిళలు బకాయిలు చెల్లించే విధంగా మార్గాలు అన్వేషించి బకాయిలు వసూలు చేయాలన్నారు. అనేక మార్లు చెప్పినా బకాయిలు జమకావ టంలేదని, బకాయిలున్న పొదుపు మహిళలపై క్రిమినల్ కేసులు నమోదు చేయటం జరుగుతుందన్నారు. స్త్రీనిధి ద్వారా ప్రతిపొదుపు మహిళలకు 8లక్షల రూపాయాలరుణం ఇచ్చేందుకు సిద్ధంగా వున్నందున అసక్తిగల పొదుపు మహిళలకు రుణాలు మంజూరు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కువ మంది మహిళలకు స్త్రీ నిధి ద్వారా8లక్షలమేర రుణాలు పొదుపు మహిళలు పొందేలా గ్రామసంఘాలు తోడ్పాటు
నందించాలన్నారు.
ఈకార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎం.సుజాత, కార్యదర్శి లీల, ఏజీఎం ఉదయ్ కుమార్ , దర్శి ఏరియా స్త్రీనిధి మేనేజర్ పవన్ కళ్యాణ్, సీసీలు మోహన్రావు, కోటేశ్వరరావు, సీవో కుమారి, వివోలు, వివోఏలు తదితరులు పాల్గొ న్నారు.
