లేక్ పీ ఎస్ పరిధిలో బాలుడు అదృశ్యం

హైదరాబాద్, మార్చి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖైరతాబాద్ ఎం.ఎస్. మక్థా ప్రాంతంలో 13 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదమ నాగరాజు అనే డ్రైవర్ కుటుంబం ఎం ఎస్ ముక్తా లో నివసిస్తోంది.ఫిబ్రవరి 27న సాయంత్రం ఇంటికి వచ్చిన నాగరాజు చిన్న కుమారుడు వెంకటాద్రి (13) రాత్రి 8 గంటలకు ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. రాత్రి 10 గంటలకు తిరిగి రావడంతో ఆలస్యంపై తండ్రి మందలించగా భయపడి మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు.కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో మార్చి 1న లేక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
చేశారు.బాలుడు సుమారు 5.4 అడుగుల ఎత్తు, తెల్లని వర్ణం, సన్నగా ఉంటాడు. చివరిసారిగా తెలుపు రంగు కుర్తా, నల్ల ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. కుడి భుజంపై మచ్చ ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి గురించి సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలని పోలీసులు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *