సికింద్రాబాద్ మార్చి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ నామాల గుండు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ గా కాచంరాము నియమితులు. కావడం పట్ల సికింద్రాబాద్ నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వల్లారపు శ్రీనివాస్ అభినందించారు.ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్ళ బృందం ఘనంగా సత్కరించారు.నామాలగుండు వీరాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో జరిగిన ఈకార్యక్రమంలో వల్లారపు శ్రీనివాస్ చైర్మన్ కాచం రాముని శాలువా పూలదండలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చిన్న గుడిగా ఉన్న ఈ ఆలయాన్ని 2012 నుండి 2014 వరకు ఎంతో శ్రమించి 48 ఫీట్ల ఆంజయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఈ ప్రాంతానికి రాము ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు.అలాంటి వ్యక్తిని తిరిగి చైర్మన్ గా నియమించడం శుభపరిణామం అన్నారు.
ఈ కార్యక్రమంలో తెదేపా సీతాఫలమండి డివిజన్ అధ్యక్షుడు జి .వి . కృష్ణ, బౌద్ధనగర్ అధ్యక్షుడు
ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు పరిటాల విజయ్ కుమార్, జగదీష్ గౌడ్, నాయుడు, వెంకట స్వామి, తదితరులు పాల్గొన్నారు.
