ప్రజారోగ్యంతోఆటలాడుతున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు. నలుగురు నిందితుల అరెస్ట్, రూ. 10 లక్షల విలువైన ఆస్తిస్వాధీనం.

హైదరాబాద్ మార్చి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. జల్పల్లి ప్రాంతంలోని ఎస్ కే రాయల్ ఎంటర్ప్రైజెస్ మరియు షాహీ గోల్డ్ కంపెనీల పై దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సింథటిక్ రంగులు , తక్కువ నాణ్యత గల పదార్థాలను ఉపయోగించి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్న జల్ పల్లి ,బాలాపూర్ కీ చెందిన ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్ (45),అదే ప్రాంతానికి చెందినమొహమ్మద్ ఇస్రాయిల్ (21) మొహమ్మద్ ఇఫ్తేఖర్ (18),నూర్ నబీ (19)
లను నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్, ఎటువంటి ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ (FSSAI) అనుమతులు లేబర్ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్రమైన వాతావరణంలో తక్కువ నాణ్యత గల పదార్థాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నాడన్నారు. ఆకర్షణీయమైన రంగు కోసం హానికరమైన సింథటిక్ రంగులను ఉపయోగిస్తూ, స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడనీ, పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, వాడియా ముస్తాఫా నగర్, జల్పల్లిలోని తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నిల్వలను స్వాధీనం చేసుకున్నామని పోలీసు లు తెలియ జేశారు.దాడులలో స్వాధీనం చేసుకున్న వస్తువులు (మొత్తం విలువ సుమారు రూ. 10,00,000 వుంటుందన్నారు.దాదాపు 340 కిలోల విడి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ప్యాక్ చేసిన డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.12 పెద్ద టబ్బుల లో అల్లం మిశ్రమం ఉంది. (ఒక్కొక్కటి 50 కిలోలు).20 బ్యాగుల వెల్లుల్లి (ఒక్కోటి 25 కిలోలు), 5 బ్యాగుల ఉప్పు.అజంతా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ బాక్సులు, సిట్రిక్ యాసిడ్ పౌడర్.గ్రైండింగ్ మెషిన్, మిక్సింగ్ మెషిన్, ప్యాకింగ్ టేపులు మరియు వేయింగ్ మెషిన్.ఎస్ కే రాయల్ మరియు షాహీ గోల్డ్ కంపెనీలకు చెందిన వేల సంఖ్యలో లేబుల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆహార పదార్థాల కల్తీకి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే డైల్ 100 ద్వారా లేదా హైదరాబాద్ సిటీ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు.ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ పహాడీషరీఫ్ పోలీసు బృందాన్ని రాజేంద్రనగర్ & శంషాబాద్ జోన్ అడిషనల్ డిసిపి ముహమ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీనీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి. సి సజ్జనర్ అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *