కే సి ఆర్ హయంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందింది…..బళ్ళారి మేయర్ గాదెప్ప.

హైదరాబాద్ మార్చి 2,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ముఖ్యమంత్రి గా కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి మేయర్ గాదెప్ప ప్రశంసించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన గాదెప్ప సోమవారం జూబ్లీహిల్స్ లోని నివాసంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన నివాసానికి వచ్చిన మేయర్ గాదెప్పను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గాదెప్ప శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గాదెప్ప మాట్లాడుతూ 10 సంవతారాల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరం అన్ని రంగాలు ఎంతో అభివృద్ధి సాధించాయని అన్నారు. సింగపూర్, మలేషియా వంటి ప్రధాన నగరాలను తలపించేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దారని అన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా చేపట్టిన రహదారుల అభివృద్ధి, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం అద్బుతం గా ఉందన్నారు. దేశంలోని ప్రఖ్యాత నగరాలకు ధీటుగా అభివృద్ధి లో పోటీ పడ్డారని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *