హైదరాబాద్ మార్చి 2
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా రేపు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలయాన్నమూసివేయనున్నట్టు ఆలయ ఈఓ భవాని శంకర్ వెల్లడించారు. మార్చ్ 3 ఉదయం 7 గంటల నుండి మార్చ్ 4 ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. బుధవారం ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ ఆలయ శుద్ధి ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం నిత్యా పూజలు నిర్వహించి ఆలయ అధికారులు భక్తులను స్వామి వారి దర్శనాలకు అనుమతించనున్నారు
