అంగన్ వాడీలకు వేతనాలు పెంచే వరకు సిఐటియు పోరాడుతుందని జిల్లా ఉపాధ్యక్షలు తాండవ రంగారావు అన్నారు.
విజయవాడలో అంగన్ వాడీ లకు వేతనాలు పెంచాలని నిన్న ఉదయం నుంచి నిరవధిక ధర్నా చేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో ఈరోజు ఉదయం 5 గంటలకు ధర్నా శిభిరం కూల్చి నిద్రపోతున్న 2 వేల మంది మహిళలను బలవంతంగా అరెస్టు చేసి నిర్భంధం ప్రయోగించడానికి వ్యతిరేకంగా ఈరోజు దరిశిలో అంగన్ వాడీలు ఐసిడిఎస్ ఫ్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, ప్రదర్శన అద్దంకిరోడ్డ్ , పొదిలి రోడ్డులలో నిర్వహించి గడియారం స్థంబం సెంటర్ లో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఆందోళన , పోరాటాలలో రంగారావు మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుంచి అంగన్ వాడీ కార్యకర్తలకు , అయాలకు వేతనాలు పెంచలేదని వైసిపి ప్రభుత్వంలో 42 రోజులపాటు చారిత్రాత్మక సమ్మె జరిగిందని వేతనాలు , ఇతర డిమాండ్స్ అమోదించి మినిట్స్ మంత్రివర్గం చేసిందని ఆ సమ్మె సందర్భంగా తెలుగుదేశం నాయకులు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో అంగన్ వాడీల సమ్మెకి మద్దత్తు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని మేం మీ వేతనాలు పెంచుతామని , డిమాండ్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చి 20 నెలలు అయినా ఇంత వరకు వేతనాలు పెంచలేదని అనేక సార్లు మంత్రులను ,ఉన్నతాధికారులను కలసి వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పుడు ప్రభుత్వ అనుమతితో శాంతి యుతంగా ధర్నా చౌక్ వద్ద ఆందోళలు చేస్తుంటే పోలీసులతో దౌర్జన్యం చేయడం , టెంట్స్ కూల్చడం, బలవంతంగా అరెస్టు చేయడంతో దెబ్బలు తగిలిన కనికరం లేకుండా వ్యహారించిందని , అంగన్ వాడీ రాష్ట్ర అధ్యక్షరాలుకు చేయి విరిగిందని అయినా దూర ప్రాంతాల పోలీసు స్టేషన్ లైన ఏలూరు, నరసరావుపేట, సత్తెనపల్లి , గుంటూరు, ఇబ్రహీం పట్నం ప్రాంతాలకు తరలించిడం అన్యాయం అని ఇలా నిరంకుశంగా అధికారం చెలాయించం చేత గతంలో అధికారం కొల్పోయారని , ఇప్పుడైనా గత అనుభవాలను దుష్టిలో వుంచుకుని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి అంగన్వావాడీల వేతనాలు తెలంగాణా ప్రభుత్వం ఇస్తున్న విధంగా అయినా 13750 రూపాయలు ఇవ్వాలని , గత 7 సంవత్సరాలుగా నిత్యావసర సరుకులు , అయిల్ ధరలు , కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు , సెల్ బిల్లులు , విధ్య, వైధ్య ఖర్చులు తదితర అన్ని వీపరీతంగా పెరిగిపోయాయని వేతనాలు పెంచే వరకు అంగన్ వాడీలు , సిఐటియు అన్ని సంఘాలతో కలసి ఉధ్యమిస్తామని తెలిపారు. ఈ ఆందోళనలలో సిఐటియు , అంగన్ వాడీ దరిశి, కురిచేడు, దొనకొండ, తాళ్ళురు, ముళ్ళమూరు మండల నాయకులు సందు వెంకటేశ్వరరావు, బోడపాటి హానుమంతరావు, తిరపతమ్మ, ఫాతిమా, విజయరాణి, అంజమ్మ, సుజాతా, లలిత కుమారి, వెంకటరమణ, ప్రశాంతి, నాగమణి, మల్లేశ్వరి, లక్ష్మిదేవి , దేవి బాయి, గర్నిపూడి జాన్ సామ్యేల్ , నిర్మల కుమారి పాల్గొన్నారు.


