జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయం వద్ద ఈనెల 31న తిరునాళ్ల సందర్భంగా 2026-27 సంవత్సరంనకు గాను తిరునాళ్ల రెండు రోజులు లీజు హుక్కలకు బహిరంగ వేలం పాటలను ఈనెల 13న శుక్రవారం ఉదయం నిర్వహించబడునని దేవాలయ ఈఓ నర్రా నారాయణ రెడ్డి తెలిపారు. తిరునాళ్ల రెండు రోజులు మినహాయించి ఆలయ పరధిలో కొబ్బరి కాయలు, పూజా సామగ్రి అమ్ముకొను హక్కు కోసం రూ.50వేలు ధరవాత్తు చెల్లించి పాటలో పాల్గొనవచ్చని తెలిపారు. కొబ్బరి చిప్పల ప్రొగు నిమిత్తం రూ.25 వేలు ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని, తిను బండారాలు, హెూటల్స్ నిర్వహణకు రూ.25వేలు ధరవత్తు చెల్లించి, కూల్ డ్రింక్స్, ఐన్ క్రీమ్స్, బొమ్మలు అమ్ముకొనుటకు రూ.10వేలు ధరావత్తు చెల్లించి వలేం పాటలో పాల్గొనవచ్చని చెప్పారు. తిరునాళ్ల రెండు రోజులు మాత్రమే కొబ్బరి కాయలు పూజా సామగ్రి అమ్ముకునేందుకు గాను 25 వేలు డిపాడిట్ చెల్లించి, కొబ్బరి చిప్పల ప్రొగుకు రూ. 10వేలు డిపాడిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని ఈఓ నర్రా నారాయణ రెడ్డి వివరించారు. ఆసక్తి ఉన్న వేలం పాట దారులు ఈనెల 13న దేవాలయ ఆవరణలో నిర్వహించి పాటలో పాల్గొనాలని కోరారు.
గుంటి గంగా భవాని వద్ద లీజు హక్కులకు బహిరంగ వేలం
10
Mar