పథకాల లబ్ధికి అర్హలైన వారు రైతు విశిష్ట సంఖ్యను తప్పనిసరిగా కలిగి ఉండాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తూర్పుగంగవరం రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. స్థానికంగా ఉన్న రైతులు తమ ఆధార్, పాన్ పుస్తకం, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తీసుకువచ్చి రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని దూర ప్రాంతాలలో ఉన్న రైతులు ఓటీపీలు చెప్పి రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
