రంజాన్ మాసం సహనం, దానం, సహోదర భావానికి ప్రతీక.బోయిన్ పల్లి ఇఫ్తార్ విందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్.

బోయిన్ పల్లి మార్చి 10 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజకవర్గం లోని బోయిన్ పల్లి కడక్ పుర ప్రాంతం లోని నేతాజీ నగర్ లో మంగళ వారం సయ్యద్ అమీర్ ఆధ్వర్యంలో గత 14 ఏళ్ళుగా నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్
శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్ఠగా ఉపవాస దీక్ష చేస్తారని, భారతదేశంలో సర్వ మతాలు సమానమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదర సోదరీమణులకు ప్రత్యేక సంక్షేమ
కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఈ పవిత్ర దినాల ముఖ్య ఉద్దేశం అందరూ దాన, సహన, సహోదర భావ గుణాలతో ప్రవర్తించాలని చెప్పారు. ఇన్నేళ్ళుగా ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేస్తున్న అమీర్ ని ఎమ్మెల్యేప్రత్యేకంగా అభినందించారు.ఈ ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, ముప్పిడి మధుకర్, మారుతి గౌడ్,బల్వంత్ రెడ్డి, అరుణ్ యాదవ్, ప్రభు గుప్త, హైదర్, రియాజుద్దీన్, సదానంద్ మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *