దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో గల నారాయణ ఈ-టెక్నో స్కూల్లో సోమవారం “స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్” కార్యక్రమం ఆకట్టుకునే విధంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము చదివిన పాఠాలు, నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులకు స్వయంగా వివరించారు.
విద్యార్థులు చదువులో సాధించిన పురోగతి, వారి అభ్యాస స్థాయిని తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు తల్లిదండ్రులతో వారి అభ్యాస ప్రగతిని పంచుకునే మంచి వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.
ఇలాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించడం పట్ల నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఈ-కిడ్స్ ఆర్ అండ్ డి హెడ్ ఆరాభి, ఏటీఎం పెద్దిరెడ్డి, కోఆర్డినేటర్ షమ్షద్, ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి, ఏఓ నారాయణ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


